తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం : మద్నూర్ తహసీల్దార్ ఎం.డి ముజీబ్

02:40 PM Nov 12, 2024 IST | Teja K
UpdateAt: 02:41 PM Nov 12, 2024 IST
Advertisement

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, తహసిల్దార్, రెవెన్యూ, తదితర అధికారులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి ముజీబ్ అన్నారు. దాడిని నిరసిస్తూ.. ఈ రోజు మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బ్లాక్ రిబ్బన్ ధరించి సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ నిరసనలు శాంతియుతంగా చేయాలని, దాడుల వల్ల కేసులు అయ్యి జీవితాలు నాశనం చేసుకోవడం కన్న ప్రజలు చెప్పదలచుకున్నది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న అధికారులకు చెప్పాలని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newskamareddy jillaMadnoor MandalTehsildar MD Mujeebtelangana
Advertisement
Next Article