లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో చిక్కిన లింగంపేట్ ఎస్సై
02:59 PM Nov 14, 2024 IST | Teja K
UpdateAt: 02:59 PM Nov 14, 2024 IST
Advertisement
ఇదే నిజం కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణ కుమార్ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండుగా ఎసిబికి చిక్కిన, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఇంకా పోలీస్ బాసులు అక్రమాలకు తావు కల్పిస్తున్నారు. అది మరవక ముందే కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గురువారం పోలీస్టేషన్ లో నేరుగా లంచం తీసకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. ఓ కేసులో శివలింగ గౌడ్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. కాగా గడిచిన వారం రోజుల్లో ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి పట్టుబడడం గమానార్హం.
Advertisement