తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

పోక్సో కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అరెస్ట్

08:53 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 08:53 PM Nov 08, 2024 IST
Advertisement

ఇదే నిజం కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో నమోదైన పోక్సో కేసులో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్, కాంత్ రెడ్డితో పాటు ఓ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నారు. ముగ్గురు నిందితులను శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మండలం పరిధిలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించగా.. అనంతరం స్కూల్ టీచర్లు, మాజీ సర్పంచ్ రాజీ చేశారు. కొద్ది రోజులకు గ్రామానికి న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు రాగా.. బాధిత కుటుంబీకులు ఈ విషయం చెప్పగా విచారణ జరిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసు విచారణను కామారెడ్డి డీఎస్పీకి బదులుగా ఎల్లారెడ్డి డీఎస్పీ పూర్తి చేయడం గమనార్హం. కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు పనితీరుపై ఎస్పీ సింధు శర్మ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డి డీఎస్పీతో విచారణ చేయించారని చర్చ జరుగుతోంది.

Advertisement

Advertisement
Tags :
kamareddy jillaTwo government teachers arrested'
Advertisement
Next Article