మరో పథకం అమలుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. నేడు కీలక ప్రకటన?
01:12 PM Oct 30, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 01:12 PM Oct 30, 2024 IST
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీపావళి కనుకగా మహిళలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై బుధవారం సాయంత్రంలోగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement
Next Article