ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేపట్టాలి : ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు
ఇదే నిజం : ముస్తాబాద్ మండలం గూడెం కొండాపూర్ నామాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు వైస్ చైర్మన్ వెలుముల రాంరెడ్డి డైరెక్టర్ లు కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాలలో వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెంటర్లలో గన్ని బ్యాగ్స్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ అన్ని వసతులు కల్పిస్తుందని రైతులంతా ధాన్యం మ్యాచర్ రాగానే సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టుకోవాలని సన్న రకం ధాన్యంకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని సెంటర్లలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని రైతులకు సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ తలారి రాణి నర్సింలు వైస్ చైర్మన్ వెలుముల రాంరెడ్డి డైరెక్టర్ లు. క్యారం రాజు. బొప్పా శంకర్, కార్యదర్శి హరినాథ్, కాంగ్రెస్ నాయకులు గాంత రాజు,దేవి రెడ్డి, గన్నె భాను మాజీ వార్డ్ సభ్యులు దశరథం, ఏఎంసి సిబ్బంది నర్సింలు, కాంగ్రెస్ నాయకులు విష్ణు వెంకటరమణ తాటిపెళ్లి బాబు రమేష్ కార్యకర్తలు సెంటర్ నిర్వాహకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.