తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

03:53 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 03:53 PM Oct 24, 2024 IST
Advertisement

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam updatesphone tapping casesupreme courttelanganaTelangana state government
Advertisement
Next Article