తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

మన హీరోలు.. తెలుగులో జీరోలు..!

03:09 PM Nov 02, 2024 IST | Vinod
UpdateAt: 03:09 PM Nov 02, 2024 IST
Advertisement

ఈ తెలుగు స్టార్ హీరోలకు తెలుగు చదవడం, రాయడం ఏ మాత్రం రాదని మీకు తెలుసా?.. ఆ తరం తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్.. సావిత్రి, భానుమతి.. అలాగే చిరంజీవి, బాలయ్య.. వరకూ కూడా తెలుగు లో రాయడం.. తెలుగు డైలాగ్స్ చదివి చెప్పడం లాంటివి వచ్చు. కాని ఆతరువాత తరంలో చాలామంది హీరోలకు తెలుగు చదవడం రాయడం రాదు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.. తెలుగు రాయడం, చదవడం రాని తెలుగు హీరోలలో మహేష్ బాబు ముందు ఉన్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఇక అక్కినేనివారి అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ కు కూడా ఒక్క ముక్క కూడా తెలుగు రాదట. ఇక కొడుకుల సంగతి సరే.. వారి జనరేషన్ వేరు అనుకోవచ్చు. కాని తండ్రి నాగార్జున పరిస్థితి కూడా అంతేనట. మరికొంత మంది స్టార్లు.. మంచు లక్ష్మీతో పాటు.. మంచు విష్ణు, వరుణ్ తేజ్, వరుణ్ సందేష్, నిహారిక, రానా దగ్గుబాటి, సుశాంత్, హీరో శ్రీకాంత్ లకు కూడా తెలుగు రాయడం, చదవడం రాదట.

Advertisement

Advertisement
Tags :
allu arjunidenijam newsidenijam telugu newsidenijam updatesmahesh babuRam charantelugu actors
Advertisement
Next Article