సమాచార హక్కు చట్టం రక్షణ సమితి-2005 లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఇదే నిజం, అచ్చంపేట: సమాచార హక్కు చట్టం ప్రాథమిక లక్ష్యం పౌరులకు సాధికారత కల్పించడంలో దోహదపడుతుంది అని అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు.శుక్రవారం నాడు అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు చిక్కుడు వంశీ కృష్ణ సమాచార హక్కు చట్టం రక్షణ సమితి -2005 లోగోను రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ ఉప అధ్యక్షులుఎమ్. లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పనిలో పారదర్శకత జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం అని ఆయన అన్నారు.అవినీతిని అరికట్టడం ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో ప్రజల కోసం పనిచేసేలా చేయడం అని పాలనా సాధనాలపై అవసరమైన నిఘా ఉంచడానికి పాలించిన వారికి ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండేలా మెరుగ్గా అమర్చబడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు తెలియజేయడానికి ఈ చట్టం ఒక పెద్ద అడుగు అని పౌరులకు సమాచార ప్రాప్తిని పొందేందుకు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పని చెయ్యాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో వారితో పాటు ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్ కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి కోశాధికారి జి ఆనంద్ కార్యనిర్వాహకులు ఏ.ప్రకాష్ సుకుమార్ ఖాజా మైనోద్దీన్ కే గోపి తదితరులు పాల్గొన్నారు.