ధర్మపురి పట్టణంలో.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన
ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆవేదన మొదలైంది. జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామంలో మారు గంగారెడ్డి హత్య జరిగింది.. అయితే ఆ తరువాత జరిగిన ధర్మపురి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో అధికంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మరియు ఒకే కులానికి చెందిన నాయకులను వేదికపై పిలవడంతో ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేదా పార్టీ కార్యక్రమమా అనే విధంగా కార్యక్రమం నిర్వహించారు అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్రామాలలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే లేకపోతే ప్రమాణ స్వీకారం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు కనీసం 500 మంది ఉండేవారు కాదని అనుకుంటున్నారు.ఆర్థికంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదుకోవడంతోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతం అయిందని బయట వినిపిస్తున్న మాట, ఇప్పుడు ధర్మపురి మండలంలో ఏం జరుగునో ఇది అంతా ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తెలిసే జరుగుతుందా అని అంటున్నారు.