హిందూ దేవాలయాల జోలికొస్తే సహించం
ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా గురువారం బిచ్కుంద మఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో హిందూ సంఘాలు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొని నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద లోని ప్రధాన పురవీధుల గుండా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు అంటూ ప్రశాంతంగా మండల కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తూ ఏర్పాటు చేశారు.
పోలీస్ అధికారులకు సహకరించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఇకముందు ఎలాంటి సంఘటనలు జరపరాదని తమ నిరసన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సోమలింగ శివాచార్య మహా స్వామీజీ, జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార హిందూ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.