రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ డిమాండ్
ఇదే నిజం : ముస్తాబాద్ మండల కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ ఆధ్వర్యంలో మండలంలోని విద్యార్థులు కొత్త బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం ర్యాలీగా బయలుదేరుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలని నినాదాలు చేశారు అనంతరం తాసిల్దార్ సురేష్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గత ఆరు సంవత్సరాల నుండి పెండింగ్లో ఫీజ్ రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ 8300 పైగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడం వల్ల వారి సర్టిఫికెట్లు ప్రైవేట్ కళాశాల యజమాన్యులు ఫీజు కడతానే సర్టిఫికెట్ ఇస్తామని తెలుపుతున్నారు పై చదువులకు వెళ్లలేని విద్యార్థుల పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రులను ముట్టడిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మండలంలోని వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.