తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

01:15 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 01:15 PM Oct 24, 2024 IST
Advertisement

ఇదేనిజం,నారాయణఖేడ్ : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండల తుర్కపల్లి గ్రామంలో ఐకేపి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందిస్తాం అన్నారు. రైతులకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతులను రాజు చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశంమని అన్నారు. రైతు దళారుల దగ్గర పంటలు అమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదాంలోనే రైతు తమ పంటలను అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలోఐకెపి అధికారులు మరియు రమేష్ చౌహాన్,పండరి రెడ్డి, అశోక్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్, ఈశ్వరప్ప, శంకర్ ముదిరాజ్, దత్తు గౌడ్,నరసింహ రెడ్డి, నెహ్రూ నాయక్, జ్ఞానేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement
Tags :
Farmers' welfareKhedMLA Patholla Sanjiva Reddy
Advertisement
Next Article