రైతు భరోసా, రుణమాఫీ అప్పుడే..!
రైతు భరోసాపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్ రబీ నుంచే రైతు భరోసా ఇస్తామని ఆయన అన్నారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా స్కీమ్ పై మంత్రి ఉపసంఘం ఏర్పాటు చేశామని, సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. అంటే ఈ సీజన్ కు రైతు భరోసా ఉండబోదని… వచ్చే సీజన్ రబీ నాటికి పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అర్హత ఉన్న రైతుకు ప్రతి ఎకరానికి రూ. 7500 చెల్లిస్తామని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్న, అర్హులైన వారందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న రైతుల రుణమాఫీపై ప్రక్రియ చేపడతామన్నారు. దీంతో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులు… ముందుగా పైన ఉన్న రుణాన్ని అక్టోబర్ 31లోపు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.