తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్.. కారణం ఇదే..!
09:35 AM Oct 15, 2024 IST
|
Vinod
UpdateAt: 09:38 AM Oct 15, 2024 IST
Advertisement
తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలనే డిమాండ్ తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మంగళవారం నుంచి బంద్ ప్రకటించాయి. మూడేళ్లుగా రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ పేర్కొంది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్ కు పిలుపునిచ్చినట్లు వెల్లడించింది.
Advertisement
Advertisement
Next Article