గంభీర్ స్థానంలో భారత్ హెడ్ కోచ్‌గా క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. ఎందుకంటే..?
వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నియమితులయ్యారు. నవంబర్ 8న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సౌతాఫ్రికాతో భారత్ నాలుగు టీ20లు ఆడనుంది. ఈ టూర్‌కు స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించనున్నట్లు బీసీసీఐ ఉన్నత అధికారి సోమవారం ధృవీకరించారు. లక్ష్మణ్‌తో పాటు సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్, శుభదీప్ ఘోష్ కోచింగ్ స్టాఫ్‌గా సౌతాఫ్రికాకు బయలుదేరతారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా టూర్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్ 10న బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో గంభీర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించలేడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించనుంది.