తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది .. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

03:23 PM Nov 07, 2024 IST | Teja K
UpdateAt: 03:23 PM Nov 07, 2024 IST
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం…విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?.. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా..నిమ్స్ లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా ? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై…
పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే..కనీసం సమీక్ష అయినా నిర్వహించారా అని అయన అన్నారు.
విద్యాశాఖను అంటిపెట్టుకొని 11నెలల్లో మీరు పీకిందేమిటి. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి..గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి..ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి. కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితం..తెలంగాణను వెంటాడుతోంది పాపం అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement

Tags :
children food poision telaganacongress partyidenijam newsKcrktr
Advertisement
Next Article