నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు
ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో మండపల్లి రాములు వారి కూతురు నవంబర్ 3 న కళ్యాణం ఉన్నందున వారికి సామాజిక కార్యకర్త, గూడెం వాస్తవ్యులు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు అలాగే విద్య సాగర్ రావు లు నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయలు నగదు ఆర్థిక సాయం తోపాటు పెళ్ళికూతురు కు పుస్తె మట్టెలు పట్టుచీర అందించగ మాజీ ప్రజా ప్రతినిధులు నాయకుల చేతుల మీదుగా అ కుటుంబానికి అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు మండపల్లి రాములు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవునూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏనుగు వేణు, రామలక్షణ పల్లె మాజీ సర్పంచ్ దమ్మరవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీడిసి చెర్మన్ నక్క దాసరి రవి, నాయకులు బోయిని రవి, జక్కుల యాదగిరి, పిట్ల చంద్రయ్య, బోయిని సతీష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.