For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

బ్లడ్ తీసుకోక ముందే బ్లడ్ రిపోర్ట్.. ఆ ఆసుపత్రి లో ఇది పరిస్థితి..!

12:15 PM Nov 01, 2024 IST | Vinod
UpdateAt: 12:15 PM Nov 01, 2024 IST
బ్లడ్ తీసుకోక ముందే బ్లడ్ రిపోర్ట్   ఆ ఆసుపత్రి లో ఇది పరిస్థితి
Advertisement

ఇదే నిజం, బాన్స్ వాడ: కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ నియోజకవర్గం అనారోగ్యంతో ఓ మహిళ ఆసుపత్రిలో చేరింది. వాస్తవంగా ఆసుపత్రిలో చేరిన రోగికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేసిన తర్వాత ఏ వ్యాధి ఉందో వైద్యాధికారులు ధ్రువీకరించి కావలసిన మందులు అందజేస్తారు. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రోగికి రక్త పరీక్షలు చేయకముందే చేసినట్లు వైద్య సిబ్బంది రిపోర్టుల ఇవ్వడం వారి నిర్లక్ష్యాన్ని చాటి చెబుతుంది.

వివరాలు వెళితే..బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రోగి నుంచి బ్లడ్ తీసుకోక ముందే బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంది మేడం రక్తం తీసుకోక ముందే రక్త పరీక్షల రిపోర్టు ఎలా వచ్చింది అని గైని రామవ్వ కొడుకు నిలదీశారు. అయినా వైద్య సిబ్బంది స్పందించకుండా చేతులెత్తి వేశారు. ఇది బాన్స్ వాడ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యాన్ని చాటిచూపుతుంది. ఆసుపత్రిలో చేరిన గైని రామవ్వకు ఎలాంటి చికిత్సలు చేయకుండా ఎలాంటి మందులు ఇవ్వట్లేదు బయట నుంచే తీసుకొని రమ్మంటున్నారని రామవ్వ కొడుకు ఆరోపించారు.

Advertisement

టెస్ట్లు కూడా బయటనే గైని రామవ్వ తన కొడుకు బాన్సువాడ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చేర్పించాడు. బ్లడ్ తీసుకోకముందే బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు . ఈ విషయమై పిట్ల మండలం మద్దెల చెరువు గ్రామానికి చెందిన రామవ్వ బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వైద్య పరీక్షలు నిర్వహించకుండా బయట నుంచి వైద్య పరీక్షలు చేయించుకో రమ్మని,మందులు లేవని బయట నుంచే తెచ్చుకోమని సలహాలు ఇస్తున్నారని రామప్ప కొడుకు సూపర్డెంట్ కు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం చేసిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Tags :
Advertisement

.