రైతులకు మరో శుభవార్త.. త్వరలోనే వారికి కూడా రుణమాఫీ!
02:50 PM Nov 15, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 02:50 PM Nov 15, 2024 IST
Advertisement
తెలంగాణలో రూ.2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వం కోరుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు కూడా సన్న బియ్యం భోజనం అందించనున్నట్లు ప్రకటించారు.
Advertisement
Advertisement
Next Article