నువ్వు నాపై వ్యక్తిగతంగా కక్ష్య పెంచుకున్నావు.. ధనుష్ పై నయనతార సంచలన వ్యాఖ్యలు
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయినిగా 'నానుమ్ రౌడీ థాని' అనే సినిమా చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు.ఈ సినిమాని స్టార్ హీరో ధనుష్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ధనుష్ కి నయనతార కి మధ్య గొడవ జరుగుతుంది. ప్రముఖ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహాన్ని డాక్యుమెంట్ చేయడానికి మరియు దానిని ప్రసారం చేయడానికి నెట్‌ఫ్లిక్స్ హక్కులు తీసుకుంది. ఈ నేపథ్యంలో 'బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో వీడియో ట్రైలర్ ని ఇటీవలే విడుదలైంది. నవంబర్ 18న పెళ్లి వీడియో ఈవెంట్‌ను విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్న డాక్యుమెంటరీలో, నా జీవితంలోని చాలా ప్రధానమైన సినిమా 'నానుమ్ రౌడీ థాని'. నేను నా పెళ్లి డాక్యుమెంటరీలో ఆ సినిమాలోని ఫోటోలు, పాటలు మొదలైనవి.. ఉపయోగించడానికి అనుమతి కోసం రెండేళ్లుగా మిమ్మల్ని అడిగాను. కానీ చివరికి మీరు నాకు ఇవ్వలేదు. మీరు నిరాకరించడం వల్ల నేను చాలా బాధపడ్డాను.
తాజాగా నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై కాపీరైట్స్ కింద లీగల్ నోటీసులు ధనుష్ పంపించారు. అనుమతి లేకుండా ఆ సీన్ ఉపయోగించందుకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసాడు. నువ్వు ఇంత దిగజారిపోతావని నేను ఊహించలేదు.. మీ నోటీసులకు మేము న్యాయబద్ధమైన సమాధానం చెబుతాం. కానీ నైతిక కోణం అనేది ఒకటి ఉటుందని, దానికి దేవుడే సమాధానం చెబుతాడు అంటూ నయనతార విమర్శించింది.అలాగే సినిమా విడుదలై 10 ఏళ్లు దాటింది. ఇంకా లోపల ఒకలా, బయటకు మరోలా నటిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మీ అహాన్ని దెబ్బతీసింది. అప్పటి నుంచి మనపై వ్యక్తిగతంగా కక్ష్య పెంచుకున్నావని తెలుసు.
ఈ సినిమా విజయంపై మీరు చాలా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వ్యాపార లెక్కలు పక్కన పెట్టి ఇలా ఇతరుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదు. ఇలాంటి విషయాల్లో మర్యాదగా వ్యవహరించడం మంచిది. ఇలాంటి వాటిని తమిళనాడు ప్రజలు సహించరు’’ అని పేర్కొంది.ఈ లేఖ ద్వారా నేను ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నానని, ఇతరుల విజయాలను చూసి అసూయపడటం మానేస్తారని ఆశిస్తున్నట్లు హితవు చెప్పింది.నీకు తెలిసివాళ్లు ఎదిగితే తప్పు కాదని, బ్యాగ్రౌండ్ లేని వాళ్లు స్టార్స్ అయితే తప్పేం లేదని, ఈ ప్రపంచం నీ సొంతం కాదంటూ చురకలు అట్టించింది. చివరిగా తన లేఖలో ఉన్న అంశాలను ఎప్పటికైన మార్చేసి కొత్త కథ అల్లేసి చెబుతావని కూడా తెలుసంటూ నయన్ ధనుస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.