For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

వాట్సాప్‌లో ఆ చాట్స్ ను సెపరేట్ చేయచ్చు.. ఎలా అంటే..!

04:25 PM Nov 12, 2024 IST | Teja K
UpdateAt: 04:27 PM Nov 12, 2024 IST
వాట్సాప్‌లో ఆ చాట్స్ ను సెపరేట్ చేయచ్చు   ఎలా అంటే
Advertisement

ప్రస్తుతం మన జీవితంలో వాట్సాప్‌ యాప్ లేకుండా ఉండటం కష్టమే.. మనం సమాచారం ఫాస్ట్ గా వేరే వారికి పంపాలంటే వాట్సాప్‌ యాప్ ఉండాల్సిందే. ఈ యాప్ ప్రొఫెషనల్‌ అవసరాలు మరియు పర్సనల్‌ పనులకు రెండింటికీ ఉపయోగించబడుతుంది. వాట్సాప్‌ యాజమాన్యం తమ వినియోగదారులకు అత్యుత్తమ మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రొఫెషనల్‌ మరియు పర్సనల్‌ చాట్‌లను వేరుగా ఉంచుకోవచ్చు. ఆ ప్రకియ ఎలానో తెలుసుకుందాం..
ముందుగా మీ Android లేదా iOS పరికరంలో WhatsApp తెరవండి. సెర్చ్‌ బార్ దిగువన, మీరు ''ఆల్‌, 'అన్‌రీడ్‌', 'ఫేవరెట్‌', 'గ్రూప్స్‌' ఎంపికతో పాటు 'ప్లస్' గుర్తు కనిపిస్తుంది. వీటిలోని 'ప్లస్' గుర్తుపై క్లిక్ చేయండి. అప్పుడు ఫోల్డర్ పేరును జోడించండి. అందులో అవసరమైన కాంటాక్ట్స్‌, గ్రూప్స్‌ యాడ్ చేయాలి.
దీని తర్వాత, కొత్తగా సృష్టించిన ఫోల్డర్ 'గ్రూప్స్' ఎంపిక కనిపిస్తుంది.ఈ ఫోల్డర్‌లోకి యాడ్‌ చేసిన ఎవరితోనైనా ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. ఫోల్డర్‌పై క్లిక్‌ చేస్తే వారితో డైరెక్ట్‌గా చాట్‌ చేయవచ్చు, ఎలాంటి గందరగోళం ఉండదు. ఇలా పర్సనల్ చాట్స్, ప్రొఫెషనల్ చాట్స్ సపరేట్‌గా మేనేజ్ చేసుకోచ్చు.ప్రొఫెషనల్‌ మరియు పర్సనల్‌ మెసేజ్‌లను వేరుగా ఉంచడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పని సంబంధిత చాట్‌లను వ్యక్తిగత వాటితో కలపకుండా ఉంచుతుంది.

Advertisement
Tags :
Advertisement

.