ప్రధాని మోదీ సతీమణిని బహిరంగంగానే నిందించింది ఎవరు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో చంద్రబాబు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మన దేశ ప్రధాని మోదీ సతీమణి గారిని బహిరంగంగానే నిందించింది ఎవరంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని తల్లిగారిని ప్రస్తావించింది ఎవరు ? అని అడిగారు.బుల్ బుల్ హిందీలో ఇష్టారాజ్యంగా మాట్లాడింది ఎవరు ?.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెను వేధించేందుకు ఇంటి నుంచే వెబ్ సైట్లు నడిపిందెవరు ? అని నిలదీశారు. వీటికన్నా ముందే సొంత మామను నగ్నంగా చిత్రీకరించింది ఎవరు ?.. అత్తగారి మీద అవాకులు చవాకులు మాట్లాడింది ఎవరు ఎవరని విజయసాయి రెడ్డి అన్నారు. ఒకటా రెండా.. ఆరంభం నుంచి వ్యక్తిత్వ హననం చేస్తూ…..ఇప్పుడు నీతులు వల్లించడం మీకే చెల్లింది..ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని విజయసాయి రెడ్డి అన్నారు.