తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నేడు అడ్డ‌మైనోళ్ల‌ని ఇళ్ల‌కి పంపేది ఎవ‌రు..? ఆ సర్వేపై రేవంత్ రెడ్డికి రివర్స్ టాక్

07:54 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 07:54 PM Nov 08, 2024 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ 9వ తేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందని ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేపై నాడు తెలుగుదేశం పార్టీ నేతగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "అడ్డ‌మైనోళ్ల‌ను మన ఇంటికి పంపించి వివ‌రాలు ఇవ్వాలా..? ఎవ‌డ‌న్న బుద్ధి ఉంటేటోడు చేసే ప‌నేనా..మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మంది వివరాలు మంది మందివి కాబట్టి ఎటు పోయిన పర్వాలేదు అని అనుకుంటాడు ఈ ముఖ్యమంత్రి గారు"..అంటూ అని నాడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. ఈ విషయంపై ఇప్పుడు అడ్డ‌మైనోళ్ల‌ని ఇళ్ల‌కి పంపేది ఎవ‌రు..? వాళ్ల‌ని ఏమ‌నాలి..? అంటూ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత స‌తీశ్‌ రెడ్డి నిల‌దీశారు. ప్రస్తుతం సోషల్ మెడియాలోఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Tags :
BRShouse-to-house surveyidenijam newsRevanth reddytelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article