తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కూల్చిన ఇండ్లెక్కడ..కాలిన కడుపులెక్కడ ?..ఇదేనా గుంపు మేస్త్రీ పాలన తీరు.. కేటీఆర్

02:29 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 02:35 PM Nov 08, 2024 IST
Advertisement

మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి..కూల్చిన ఇండ్లెక్కడ - కాలిన కడుపులెక్కడ -నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ?. ఆగిన గుండెలెక్కడ - రగిలిన మనసులెక్కడ .. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ - నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ ? అంటూ అయన ప్రశించారు.
నీ కుట్రలకు అంబర్ పేట్ - అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే - నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ ?.. నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది -గోల్నాక గొల్లుమంటుంది-దిలుషుక్ నగర్ ఢీలా పడ్డది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయ్యా సంబరాల రాం బాబు - నీ అన్యాయానికి..అవేధనలు,ఆవేశాలు,అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అంటూ కేటీఆర్ ప్రశించారు. తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం ఏసినట్లు .. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ ..నాయకత్వం అంటే కూల్చడం కాదు .. నిర్మించడం అని అన్నారు.
నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు .. తొవ్వ చూపడం అని కేటీఆర్ ట్విట్ చేసారు.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddyidenijam updateskalina kaudpu ekada gumpu mesthriKcrktrkulichina illu eladalatestnewstelaganatelugu latest news in idenijam
Advertisement
Next Article