రైతు భరోసా ఎప్పుడంటే..?
02:42 AM Nov 17, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:46 PM Nov 16, 2024 IST
Advertisement
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిజేశారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.
Advertisement