ఆ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏంటి.. సమంత రెండో పెళ్లి చేసుకోనుందా..?
07:45 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 08:06 PM Nov 11, 2024 IST
Advertisement
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయంతో జనాలని ఆకట్టుకుంటుంది. సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా చేసిన సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. 'హనీ బన్నీ' వెబ్ సిరీస్‌లో సమంత తల్లి పాత్ర పోషించింది. ఆ పాత్ర గురించి సమంత మాట్లాడుతూ.. 'నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని చెపింది. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా..? అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
Advertisement