రేవంత్ పాలనలో ఇల్లు కూలగొట్టడం తప్పా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం తెలియదు.. హరీశ్ రావు
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు మరిచిపోరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఆలస్యమయ్యాయని, కేసీఆర్ హయాంలో రైతులకు సత్వర సాయం అందిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంతరాయం ఏర్పడిందని అన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. 11 నెలల రేవంత్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించారా అని ప్రశ్నించారు. కూలగొట్టడం తప్పా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం తేలీదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.