For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

వార ఫలాలు (27-10-2024 నుండి 02-11-2024)

10:57 AM Oct 27, 2024 IST | Vinod
UpdateAt: 10:57 AM Oct 27, 2024 IST
వార ఫలాలు  27 10 2024 నుండి 02 11 2024
Advertisement

మేషం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంత రంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రముఖులు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.

వృషభం
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అంచనాలు ఫలించవు. మీ మాట తీరు అపోహలకు దారితీస్తుంది. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆశావహ దృక్పథంతో మెలగండి. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.

Advertisement

మిథునం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు చేపడతారు.

కర్కాటకం
ఈ వారం వారఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి అనుకూలతలున్నాయి. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. గురువారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు.

సింహం
ఈ వారం కలిసివచ్చే సమయం. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతు తెలుసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి.

కన్య
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. శుక్ర, శనివారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు.

తుల
ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు.

వృశ్చికం
సమయస్ఫూర్తిగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసివస్తాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. సన్నిహితులతో సంభాషిస్తారు.

ధనుస్సు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పట్టించుకోవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. సమస్యలు సన్నిహితులకు తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

మకరం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. ధనసహాయం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తవు తాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.

కుంభం
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

మీనం
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే కార్యాన్ని సాధిస్తారు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

Tags :
Advertisement

.