తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

వైఎస్‌ జగన్‌, షర్మిల ఆస్తి వివాదంపై స్పందించిన విజయమ్మ…ఆస్తులు పంచలేదు..!

07:07 PM Oct 29, 2024 IST | Teja K
UpdateAt: 07:07 PM Oct 29, 2024 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌, షర్మిల ఆస్తి వివాదంపై వారి తల్లి వైఎస్‌ విజయమ్మ ఈరోజు స్పందించారు.ఈ ఆస్తి వివాదంపై ఆమె ఒక లేఖ రాసారు. తాజా ఘటనలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు.తన కుటుంబానికి ఏమైందో అర్థం కావడం లేదని, ఎంత అడ్డుకోవాలని చూసినా జరగకూడనివన్నీ కళ్ల ముందే జరుగుతున్నాయని విజయమ్మ అన్నారు. తమ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కొనసాగుతుందని విజయమ్మ అన్నారు. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని, ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయని తెలిపారు.ఇలాగే కొనసాగకూడదని, తన పిల్లలకు మంచిది కాదని, రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ఈ విషయానికి తాను రాకూడదని, అయితే రావాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు.
వైఎస్‌ఆర్‌ జీవించి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారని, ఇది అవాస్తవమన్నారు. వైఎస్ఆర్ ఇద్దరు పిల్లలు పెద్దవుతున్న రోజుల నుంచి పాప పేరు మీద కొన్ని ఆస్తులు.. జగన్ పేరు మీద కొన్ని ఆస్తులు పెట్టారు. అయితే అది ఆస్తుల పంపకాల వ్యవహారం కాదన్నారు. వైఎస్ బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారని, అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సిందన్నారు. వైఎస్సార్ చేసింది పంపకం కాదని, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే అన్నారు.

Advertisement

ఆస్తి ఇద్దరికీ సమానం అన్నది నిజం. నలుగురు చిన్న పిల్లలతో సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆదేశం నిజమేనన్నారు. జగన్ ఆస్తులు పెంచుకోవడంలో కష్టాలు పడుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనన్నది వాస్తవమని అన్నారు. బాధ్యతగల కొడుకుగా జగన్ కుటుంబ ఆస్తులను కాపాడుకోవాల్సిన మాట కూడా నిజం. రాజశేఖర్ రెడ్డి బతికుండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. కుటుంబ ఆస్తి అంతా. మేము దానిని పంచుకోవాలని భావించినప్పుడు, అతను ప్రమాదంలో మరణించారు. ఆడిటర్‌గా సాయిరెడ్డికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. తెలిసి అవాస్తవాలు మాట్లాడారు అని ఆమె పేర్కొన్నారు. పుట్టిన ప్రతి తల్లిదండ్రులతో పిల్లలందరూ సమానమే. ఒక పిల్లవాడు మరో పిల్లవాడికి అన్యాయం చేస్తే చూడటం చాలా కష్టం. తల్లిగా, అన్యాయానికి గురైన బిడ్డ కోసం మాట్లాడటం నా కర్తవ్యం. ఎందరో పెద్ద మనుషులు చెప్పే అబద్ధాల మధ్య నిజం తెలియాలంటే ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే… అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు అని ఆమె తెలిపారు.

Advertisement

Tags :
idenijam newsidenijam telugu newsVijayammaYS Jagan and Sharmila's property dispute
Advertisement
Next Article