మెట్లపై నుంచి జారిపడ్డ హీరో విజయ్ దేవరకొండ
05:51 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 05:51 PM Nov 08, 2024 IST
Advertisement
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మెట్లు దిగి పడిపోయాడు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం “సాహిబా” అనే ప్రైవేట్ ఆల్బమ్‌ను రూపొందిస్తున్నాడు.అందుకే ఈ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ముంబై వెళ్లాడు. ఆ కార్యక్రమంలో పాల్గొని మెట్లు దిగుతుండగా దేవరకొండ జారి కిందపడిపోయాడు. ముంబైలో ఒక కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డాడు. అతని బృందం వెంటనే స్పందించి సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.అయితే ఈ ప్రమాదంలో విజయం గాయలేమి కాలేదని, ప్రస్తుతం విజయ్ బాగానే ఉన్నాడని ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంధువులు సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గౌతమ్ తననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు.
Advertisement