తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నేటి రాశి ఫలాలు (28-10-2024, సోమవారం)

10:08 AM Oct 28, 2024 IST | Vinod
UpdateAt: 10:08 AM Oct 28, 2024 IST
Advertisement

మేషం
ఖర్చులు ఊహించిన దానికన్నా ఎక్కువ‌గా ఉంటాయి. ఉద్వేగాలను, కఠినమైన మాటలను కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ సంబంధమైన ప్రయాణములు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలలో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా కృషి చేస్తారు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. గృహ, విద్య వాహన, వాతావరణంలో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ కొంత ప్రశాంతంగా ఆలోచించి ఆత్మీయ సహకారంతో దాని అధిగమిస్తారు. ఇంటిలోని పెద్దలతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.

Advertisement

వృషభం
భూ సంబంధమైన పరమైన అంశాలలో ఆదాయము బాగా ఉంటుంది. చమత్కారంగా మాట్లాడతారు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ పనులు సాధించుకుంటారు. ఉద్వేగములు అధికంగా ఉంటాయి. ఆత్మీయుల సహకారము తోడ్పడుతూ అనుకున్న పనులు సాధించుకుంటారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నత అధికారులు సలహా సంప్రదింపులతో కొంత కాలముగా ఆగి ఉన్న పనులను మొదలుపెడతారు. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది. సంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. సంతానమునకు అభివృద్ధి, ఆత్మీయులు సహకరిస్తారు.

Advertisement

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు శారీరక శ్రద్ధ, వ్యాయామం మీద శ్రద్ధ చూపించాలి. వృత్తిపరమైన అధిక శ్రమతో నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. నూతన శక్తితో మనసు ఉత్సాహంగా కొత్త నిర్ణయాలు కొరకు ఆలోచనలు చేస్తుంది. విందువినోదాల్లో ఖర్చులు అధికము. గౌరవము కీర్తి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, కుటుంబం, మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. తోబుట్టులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో ఆకర్షణీయముగా మాట్లాడి ఇతరుల మనసును గెలుస్తారు. కుటుంబంలో మీ అధిపత్యం పెరుగుతుంది. ఖర్చులు మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. వాగ్దానం నిలబెట్టుకోవడం కొంత వరకు కష్టం.

కర్కాటకం
శారీరక శ్రమ నిద్రలేమి, కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ పెంచడం మేలు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహనపరమైన లాభాలు. తల్లితండ్రుల సహకారం. కుటుంబ పరమైన విషయాల్లో, బంధువుల కొరకు ఖర్చులు చేస్తారు. మాట్లాడే మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కంటికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత అధికారుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయాన్నిపూర్తిచేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి.

సింహం
మీ ఆలోచన విధానం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఇష్టమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తారు, కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. మొత్తం మీద లాభదాయకముగా ఉంటుంది. ఇతరుల సహకారం బాగుంటుంది. ఇతరులకు సలహాలు ఇస్తారు. వృత్తి పరమైన అభివృద్ధి. తెలివితేటలు ఉపయోగించి చాకచక్యంగా పనులు నిర్వర్తించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. నూతన నిర్మాణాల కొరకు ఆలోచన అధికం చేస్తారు. పనులు అవలీలగా సాధించుకుంటూ ముందుకు వెళ్లి పోతారు. ఉద్వేగాలకు లోనై కుటుంబ సంబంధమైన ముఖ్యమైన కార్యక్రమాలలో ఇబ్బందులకు గురవుతారు.

కన్య
నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. వృత్తిపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో కలిసి కుటుంబ పరమైన ప్రయాణాలు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార పరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమతో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. దూర ప్రదేశంలో ఉండే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జగడములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో శత్రుత్వములు రాకుండా వ్యవహరించాలి.

తుల
తోబుట్టువులతో అభిప్రాయ బేధములు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వారసత్వపు ఆస్తుల చర్చల మీద, భూమికిసంబంధించిన అంశాలపట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో రహస్య శత్రువుల అంశాలలో కొత్త ఘర్షణ ఉంటుంది. దూర ప్రదేశములలో ఉండే వ్యక్తుల సహకారంతో పనుల కోసం ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులు సహకరిస్తారు కొత్త బాధ్యతలు అప్పచెప్తారు. గృహ సంబంధ అంశాల కొరకు వాహన మార్పుల కొరకు ఆలోచన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంబంధం లేని వ్యక్తుల జోక్యం దూర ప్రదేశాల్లో ఉండే వారి సలహాల వ‌ల్ల‌ ఆటంకాలు చికాకులు కలిగిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొంత శ్రమను తగ్గిస్తుంది.

వృశ్చికం
దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ, ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు, ఘర్షణలు రాకుండా జాగ్రత్త వహించాలి. సంఘాల్లో వ్యాపార రంగంలో అనుభవం ఉన్న నూతన వ్యక్తుల పరిచయాలు, భాగస్వామికి సంబం ధించిన వృత్తిపరమైన విషయాలలో, ఆదాయ అంశాలలో ఆకస్మిక మార్పులు. వివాహ సంబంధమైన అంశాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. పనుల పట్ల అసంతృప్తి ఆటంకాలు. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమ. తండ్రితో చర్చించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం కొంతవరకు మంచిది. వృత్తి పరమైన విషయాలలో కొంత నిరాశక్తత, అధిక శ్రమ. క్రింద పనిచేసే వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు.

ధనుస్సు
మీ శక్తి మీద మీకు నమ్మకం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సంఘములో గౌరవం కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. రుణాలు చెల్లిస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు పెడతాయి. ఇతరుల సహకారంతో అనుకున్న పనులను పెద్ద శ్రమ లేకుండా సాధించుకుంటారు. శ్రమకు తగిన సన్మానాలు పొందుతారు. నూతన వృత్తులకు అవకాశాలు లభిస్తుంది. ఉన్నత అధికారులతో, ప్రభుత్వ రంగంలో ఉండే వ్యక్తులతో నిదానంగా వ్యవహరించి పనులు ముందుకు తీసుకువెళ్లాలి. గౌరవం తగ్గకుండా చూసుకోండి. ఆకస్మికమైన ఖర్చులు మాట నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇబ్బందులు గురిచేస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

మకరం
నూతన వృత్తి కొరకు చేయు ప్రయత్నాలు, ఆగిన పనులు ముందుకు వెళతాయి. ఆరోగ్యం బాగుంటుంది. తోబుట్టువులు విషయాలు, వృత్తి సంబంధించిన ఆలోచనలు ప్రశాంతతను తగ్గిస్తాయి. పట్టుదలగా వ్యవహరించి మిత్రుల సహకారంతో, మీనైపుణ్యమైన కమ్యూనికేష‌న్‌తో సాధించుకుంటారు. మీ దగ్గర తీసుకున్న రుణము ఇతరులు కొంతవరకు మీకు చెల్లిస్తారు. పోటీలలో అధిక శ్రమతో నెగ్గుతారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతుంది. సంఘంలో గుర్తింపు గౌరవం నూతన పరిచయాలు ఏర్పడతాయి. తల్లి తరపు బంధు వర్గాన్ని కలుస్తారు. వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో శ్రద్ధ అవసరం.

కుంభం
సృజనాత్మకత, భాగస్వామి సంబంధ ఆత్మీయుల రాకపోకలు, సంతాన సంబంధం నూతన పెట్టుబడులు, గృహ సంబంధ ఆదాయాల మీద చర్చలు జరుగుతాయి. భూ సంబంధ విషయాల గురించి పెట్టుబడుల గురించి ముందుకు సాగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. పాత ఆలోచనలు అదేపనిగా గుర్తుకు వస్తుంటాయి. మనసులో స్థిరత్వం తక్కువ. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటారు. ఇంతవరకు ఆగిన పనులు అవలీలగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. పాత రుణములను కొంతవరకు తీరుస్తారు. ఖర్చులు అధికముగా ఉంటాయి.

మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో శ్రమతో విజయాన్ని సాధిస్తారు. వ్రాత నైపుణ్యాలు పెరుగుతాయి. పట్టుదలగా అనుకున్న పనులు సాధిస్తారు. విద్యా వాహన గృహసౌకర్యాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వతంత్రంగా ఆలోచనలు చేస్తారు. సంతానపరమైన విషయాలలో సృజనాత్మక అంశాలలో పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలలో కొత్త నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. గృహ వాహన సంబంధ అంశాల కొనుగోలు కొరకు లాభపరమైన నిర్ణయాలు చేయడం జరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి, గౌరవం పెరుగుతుంది. ఉన్నత అధికారులు తోనూ రాజకీయ నాయకులతోనూ కలిసి వృత్తిపరమైన విషయాలలో చర్చిస్తారు.

Tags :
Astrologyidenijam newsidenijam telugu newsidenijam updatesrashi phalalutoday horoscope
Advertisement
Next Article