తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కుట్రపూరితంగానే కలెక్టర్‌పై వారు దాడికి పాల్పడ్డారు.. భట్టి విక్రమార్క

06:42 PM Nov 13, 2024 IST | Teja K
UpdateAt: 06:45 PM Nov 13, 2024 IST
Advertisement

కుట్రపూరితంగానే లగచర్లలో కలెక్టర్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన కొడంగల్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ప్రపంచంతో పోటీ పడగలదన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాలని, అందుకే పరిశ్రమలు పెద్దఎత్తున తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ఫార్మా సిటీ వల్ల భూములు కోల్పోతున్న రైతుల బాధను అర్థం చేసుకోగలమన్నారు. అందుకే మంచి ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు పరిశ్రమలు రావడం బీఆర్‌ఎస్ కు ఇష్టం లేనట్లుగా ఉందని,అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

Advertisement

Advertisement
Tags :
bhatti vikramarkacollector atackidenijam newsidenijam telugu newstelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article