తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

లీగల్ నోటీసులతో బెదిరిస్తే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరు.. బండి సంజయ్

03:14 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 03:14 PM Oct 23, 2024 IST
Advertisement

కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ… లీగల్ నోటీసులతో బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ లేరన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ నోటీసులు పంపారని, కేటీఆర్ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది అని వాపోయారు. తాను మొదట కేటీఆర్‌పై ఆరోపణలు చేయలేదని, తనపైనే అయన చేశారని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు. కేటీఆర్ బాగోతం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో ఏం జరిగిందో తెలంగాణ మొత్తానికి తెలుసునని అన్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ మాటలకు తాను మౌఖిక కౌంటర్ ఇచ్చానని, తనకు లీగల్ నోటీసులు పంపినందున నోటీసులతోనే సమాధానం ఇస్తానని తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
bandi sanjaydrug caseidenijam newsidenijam telugu newsktr
Advertisement
Next Article