రుణమాఫీ నిరీక్షణకు తెర.. డిసెంబర్ చివరి నాటికి రూ. 13వేల కోట్లు మాఫీ..!
05:05 PM Nov 08, 2024 IST | Vinod
UpdateAt: 05:05 PM Nov 08, 2024 IST
Advertisement
తెలంగాణలో ఇప్పటివరకూ అర్హత గల రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. తాము ఇంకా 13వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యాల్సి ఉంది అని మంత్రి అన్నారు. అంటే.. లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కాని వారు ఉండిపోయారు. వారంతా ఎప్పుడు రుణం మాఫీ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి అర్హత గల రైతులందరికీ రుణమాఫీ చేసి తీరతామని మంత్రి అన్నారు. రూ.13వేల కోట్లు కావాలంటే మాటలు కాదు. ఇంకా చాలా పథకాల అమలు కోసం, ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వానికి మనీ కావాలి. అవన్నీ సెటిల్ చేస్తూ, రైతులకు రూ.13వేల కోట్లు కేటాయించాలంటే.. పెద్ద సవాలే. అందుకే డిసెంబర్ 31 వరకూ టైమ్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
Advertisement