తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు.. కబ్జా భూములు ఖాళీ చేయాలి లేదంటే..

11:22 AM Nov 08, 2024 IST | Vinod
UpdateAt: 11:22 AM Nov 08, 2024 IST
Advertisement

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో చెరువు భూములు ఖాళీ చేయాలని నోటీసులలో ఉంది. లేదంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 5న ధర్మవరం నీటిపారుదల శాఖ అధికారులు నోటిసులు జారీ చేశారు. కేతిరెడ్డి మొత్తం 20 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారు అంటూ నోటీసులలో ఉంది. ఈ నెల 6న కేతిరెడ్డి PA నోటీసులు అందుకున్నారు.

Advertisement

భూకబ్జా ఆరోపణలపై కేతిరెడ్డి ఏమన్నారంటే!
భూకబ్జా ఆరోపణలపై కేతిరెడ్డి స్పందించారు. ‘‘ ప్రస్తుతానికి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక‌ నాపై‌ దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

Advertisement

Tags :
idenijam newsidenijam telugu newsidenijam updateskethireddyrevenue department
Advertisement
Next Article