తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఫలించిన పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం..దిగివచ్చిన ప్రభుత్వం

06:38 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 06:40 PM Oct 25, 2024 IST
Advertisement

తెలంగాణ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్లకు ఊరట లభించింది. వారి కుటుంబాలు చేసిన పోరాటం కారణంగా ప్రభుత్వం దిగివచ్చి గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక అదనపు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవుల విషయంలో ఊరట లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను మార్చి కొత్త సెలవు మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మాన్యువల్‌పై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement
Tags :
DGP ordersidenijam newslatest newsPolice ConstablesTelangana Battalion got relief
Advertisement
Next Article