ప్రశ్నించే వారంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వణుకు..కేటీఆర్
07:24 PM Nov 09, 2024 IST | Teja K
UpdateAt: 07:24 PM Nov 09, 2024 IST
Advertisement
జర్నలిస్ట్, వైఆర్ టీవీ రంజిత్ అరెస్ట్ అప్రజాస్వామికం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో ఎవరూ ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమకేసులు, దాడులు చేస్తున్నారు అని మండిపడ్డారు. మీ 11 నెలల పాలనలో జర్నలిస్ట్ లపై దాడులు, అక్రమ కేసులు నిత్యం కృత్యమయ్యాయి అని అన్నారు. ముఖ్యమంత్రి చేసే దద్దమ్మ పనులను నిలదీసినందుకే రంజిత్ ను నిర్భందించారు అని కేసీఆర్ వాపోయారు. వెంటనే రంజిత్ ను విడుదల చేయాలి. అక్రమ కేసులను ఎత్తివేయాలిని కేటీఆర్ డిమాండ్ చేసారు. జర్నలిస్ట్ లపై ప్రభుత్వ నిర్భందాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అని తెలిపారు.
Advertisement