సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు
08:49 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 08:50 PM Nov 11, 2024 IST
Advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. టాటా గ్రూప్ మరియు ఏపీ ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి.టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖపట్నంలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీసీఎస్ ద్వారా విశాఖలో 10 వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.
Advertisement