తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

యూపీలో ఉమ్మేసిన తందూరి రోటీలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం యోగి ప్రభుత్వం

08:51 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 08:51 PM Oct 23, 2024 IST
Advertisement

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాబా యజమాని ఉమ్మివేసి తందూరీ రోటీలు తయారు చేసిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండడంతో యూపీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆహార పదార్థాలను పాడుచేసి ఉమ్మివేసే సంఘటనలు ఎక్కువగా యూపీలో జరుగుతున్నాయి… దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆహారంలో ఉమ్మివేయడం లేదా ఉమ్మి కలిపిన ఆహారాన్ని అందించడం వంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కీలక సమావేశం నిర్వహించింది.ఇలాంటి హానికర చర్యలను నిరోధించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను రూపొందించనున్నారు. ఉమ్మివేయడాన్ని నిషేధించే ఆర్డినెన్స్ 2024', 'యుపి ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ ఇన్ కాంటామినేషన్ (కన్స్యూమర్ రైట్ టు నో) ఆర్డినెన్స్ 2024' ని తీసుకువస్తుంది. హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్, ఆశిష్ సింగ్ (హోం శాఖ), సంజీవ్ గుప్తాలతో పాటు సంబంధిత అధికారులతో సీఎం యోగి సమావేశమయ్యారు.

Advertisement

ఇటీవలే యూపీలో రోటీలు కాల్చడానికి ముందు ఉమ్మివేస్తున్నాడని పలువురు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తాండూరు కార్మికుడిని మరియు తినుబండార యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో… పోలీసులు అతని అరెస్ట్ చేశారు.

Advertisement

Tags :
CM Yogi's governmentidenijam newsTandoori rotistelugu latest news in idenijam
Advertisement
Next Article