ఏపీ హైకోర్టులో స్టార్ హీరో అల్లుఅర్జున్‌కు..భారీ ఊరట
05:04 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 05:04 PM Oct 25, 2024 IST
Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ హీరో అల్లు అర్జున్ పై ఏపీలోని నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసారు. తాజాగా అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి తమపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణ జరగగా.. అల్లు అర్జునకు కోర్టు భారీ ఊరటనిచ్చింది. నవంబర్ 6వ తేదీ వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.అలాగే.. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు నవంబర్ 6న ఇస్తామని కోర్టు పేర్కొంది.
Advertisement