ఆమె ఉద్దేశం నాకు, బీఆర్ఎస్ కి నష్టం చేయాలనే ఇలా చేసింది.. కేటీఆర్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయంపై నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు వెళ్లారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నా గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తోందని సురేఖ వ్యాఖ్యలు చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలు టీవీలో చూశాను. ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా నా పై మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నేను ఫోన్ ట్యాప్ చేస్తున్నాను చేశానని చెప్పారు. ఆమె ఉద్దేశం నాకు, బీఆర్ఎస్ కి నష్టం చేయాలనే ఇలా చేసింది అని అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవమని మొత్తం 30 నిమిషాల పాటు కేటీఆర్ వాంగుళం చెప్పారు. కొండా సురేఖ మీడియాతో మాట్లాడిన వీడియో రికార్డింగ్‌లను కూడా కోర్టుకు అందజేశారు.