రైతు భరోసా రూ.15 వేలు.. నేడు తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన?
05:00 PM Oct 31, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:00 PM Oct 31, 2024 IST
Advertisement
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రకటన చేయనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేయగా.. మరికొంత మంది అర్హులకు చేయాల్సి ఉంది.
Advertisement