తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఇక నుంచి నీ పేరు ఎగవేతల రెడ్డి : హరీశ్ రావు

08:42 PM Oct 29, 2024 IST | Teja K
UpdateAt: 08:42 PM Oct 29, 2024 IST
Advertisement

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కొత్త పేరు పెట్టారు. హామీలు, పథకాలు ఎగ్గొట్టిన ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయనకు ఎగవేతల రెడ్డి అని నామకరణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటలను అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతుల కోసం ఎంతకైనా తెగించి పోరాడుతామని ప్రకటించారు.రేవంత్‌రెడ్డి హయాంలో కొత్త పథకాలేవీ రాలేదు, ఉన్న పథకాలు మూతపడుతున్నాయి. బతుకమ్మ చీరలు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, చెరువుల్లో చేప పిల్లలు లేవు' అని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నందుకే ఈ మాత్రమైనా చేస్తున్నారు.వరంగల్ డిక్లరేషన్‌లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలు చేసారా ?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. 'తెలంగాణ పోరాటాల గడ్డ అని, చంద్రబాబు, వైఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేశామని ' గుర్తు చేశారు.ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. పాలకుడు దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అవుతుందని నేను దేవుడి దగ్గరకి వెళ్లాను. ప్రజలను కాపాడు.. పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నా' అని ఆయన తెలిపారు. దానికి కూడా నా మీద కేసులు పెట్టారని అన్నారు.
మోసం చేసిన అతడి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' అని హరీశ్ రావు నామకరణం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవి పది నెలలు గడుస్తున్నా అమలు చేయలేదని ప్రశ్నిస్తే బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామన్నారు.బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు నాపై ఎన్ని కేసులు పెట్టినా నువ్వు చెప్పిన హామీలు అమలు చేసేదాకా నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తా. బేగం బజార్ కాదు ఏ బజార్‌లో కేసులు పెట్టుకుంటవో పెట్టుకో' అని హరీశ్ రావు సవాల్‌ విసిరారు.

Advertisement

Advertisement
Tags :
Egavethala ReddyHarish raoidenijam newsidenijam telugu newsRevanth reddytelugu latest news in idenijam
Advertisement
Next Article