తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతుల కోసం ఒకటి, రెండేళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధం.. కేటీఆర్‌

05:39 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 05:39 PM Oct 24, 2024 IST
Advertisement

నేను రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా రాంలీలా మైదానంలో నిర్వహించిన రైతుల ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో పోలీసుల సతీమణులు ధర్నాలు చేసే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు, రైతుల కోసం ఒకటి, రెండేళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధం. ఎవరికీ భయపడాల్సిన పని లేదని తేల్చిచెప్పారు. అసలు చీటింగ్ కేసులు ఎవరిపై పెట్టాలి.. బంగారం ఇస్తానని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌబీలపై కేసులు పెట్టాలి. రైతుబంధు మాఫీ చేయనందుకు రైతులు కేసులు పెట్టాలని…అన్ని వర్గాల పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి చీటింగ్ కేసులు పెడితే ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ నేత కూడా మిగలరని కేటీఆర్ అన్నారు.

Advertisement

Advertisement
Tags :
idenijam telugu newsktrReady to stay in jailtelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article