రేషన్ కార్డుదారులు అలర్ట్.. డిసెంబర్ 31 లాస్ట్ డేట్..!
భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, స్థానిక ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు వివిధ నిత్యావసర వస్తువులను అందించడానికి రేషన్ కార్డులను ప్రాతిపదికగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ కింద కార్డు హోల్డర్లు రేషన్ అందుకోవటానికి తప్పనిసరిగా రేషన్ కార్డుల ఈకేవైసీని అప్‌డేట్ చేయటం చాలా ముఖ్యం. ప్రతి కార్డ్ హోల్డర్ వారి ఈకేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. గతంలో దీనికి చివరి తేదీని అక్టోబర్ 31గా ఉంచిన ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొడిగించింది.అనేక సమస్యలు రావడం, లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులకు వినియోగదారుల ఆధార్ కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే ఆహార పంపిణీలో 2-4 శాతం తప్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 100 శాతం తప్పులను నివారించడానికి, ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లను EKYC ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. ఈ ప్రక్రియలో కార్డుదారులు కొత్త 4G e-POS మెషీన్లలో తమ ఆధార్ నంబర్లను నమోదు చేయాలి. ఈ క్రమంలో వెరిఫికేషన్ కోసం వేలిముద్రలను తప్పనిసరిగా స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని ఆహార పంపిణీ శాఖ దుకాణాల యజమానులను ఆదేశించింది.దీని కోసం ప్రజలు నేరుగా వారి రేషన్ దుకాణానికి వెళ్లి వారి KYCని అప్‌డేట్ చేసుకోవచ్చు. రేషన్ షాపుల్లో వేలిముద్రల నమోదుతో వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.