తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది బాలుడు కిడ్నప్

02:16 PM Oct 20, 2024 IST | Teja K
UpdateAt: 02:16 PM Oct 20, 2024 IST
Advertisement

నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి ఏడాది బాలుడు మణికంఠ అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజు తన భార్య లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం సాయంత్రం ఏడాది కొడుకు బాబుతో కలిసి నిజామాబాద్ జీజీహెచ్‌కు వచ్చారు. అప్పటికే ఓపీ సేవలు నిలిచిపోవడంతో డ్యూటీ డాక్టర్‌తో చికిత్స చేయించారు. ఆ తర్వాత రాత్రి ఆసుపత్రి ఆవరణలో నిద్రించారు. అర్ధరాత్రి 12.21 గంటల తర్వాత పక్కనే నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. శనివారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి బాబు కనిపించకపోవడంతో రాజు దంపతులు ఆస్పత్రి అంతా వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌ఓ రఘుపతిని ఆశ్రయించారు. ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తున్న దృశ్యాలు, వారిలో ఒకరు బాలుడిని పట్టుకుని ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ ఆస్పత్రిలో కేవలం మూడు నెలల్లో రెండు కిడ్నాప్ కేసులు జరిగాయి.

Advertisement

Advertisement
Tags :
idenijam newsNizamabad government hospitalOne year old boy kidnappedtelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article