మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ.. ఇలా ఆడితే జట్టులో స్థానం కష్టమే..!
అభిషేక్ శర్మ.. యంగ్ సెన్సేషన్.. భారత జట్టులో స్థానం లభించిన తర్వాత జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కానీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో, తనకు వచ్చిన అవకాశాలను అభిషేక్ శర్మ వినియోగించుకోలేకపోతున్నాడు. ఇటీవలి బంగ్లాదేశ్ సిరీస్లో అభిషేక్ శర్మకు అవకాశం లభించింది. కానీ అతడు మూడు మ్యాచ్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. చివరికి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్ తొలి మ్యాచ్ లోనూ అదే వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కేవలం ఏడు పరులు మాత్రమే చేసి అతడు అవుట్ అయ్యాడు.. వాస్తవానికి రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. ఓపెనర్ స్థానం దశాబ్దం అనంతరం ఖాళీ అయింది. ఆ స్థానంలో అభిషేక్ శర్మ భర్తీ అవుతాడనుకుంటే.. అతడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇలా ఆడితే జట్టులో అవకాశాలు లభించడం కష్టమే.