ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్య
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని సిద్ధిఖీపై శనివారం సాయంత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. బాంద్రాలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా సిద్ధిఖీపై దాడి జరిగింది. బాంద్రా ఈస్ట్‌లోని ఆయన కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దుండగులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితులను కర్నైల్ సింగ్ (హర్యానా), ధరమ్ రాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్)గా గుర్తించారు. మరొకరు పరారీలో ఉన్నారు.