క్రియేటర్స్'కి ఎక్కువ డబులు.. యూట్యూబ్ మరో కొత్త ఫీచర్..!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. కంటెంట్ క్రియేటర్స్'కి ఆదాయాన్ని పెంచడానికి ఈ ఫీచర్‌ను తెచ్చింది. అయితే యూట్యూబ్ కొత్త షాపింగ్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టబడింది. ఈ ఫీచర్ ద్వారా, కంటెంట్ క్రియేటర్స్ ఉత్పత్తులను ట్యాగ్ చేయవచ్చు మరియు ఆదాయాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ మరియు మైంత్రాతో యూట్యూబ్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, యూట్యూబ్ క్రియేటర్స్ తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయాలి. వీక్షకులు రిటైలర్‌ల సైట్‌లలో వాటిని కొనుగోలు చేసినప్పుడు క్రియేటర్స్ కమీషన్ డబ్బు పొందుతారు. క్రియేటర్స్ ఈ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే.. యూట్యూబ్ షాపింగ్‌కు సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేయడానికి 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అయితే, యూట్యూబ్ కిడ్స్ ప్రోగ్రామ్ మేకర్స్ మరియు మ్యూజిక్ ఛానెల్ ఆపరేటర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరని యూట్యూబ్ తెలిపింది.