ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం
03:09 PM Nov 07, 2024 IST | Teja K
UpdateAt: 03:09 PM Nov 07, 2024 IST
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలను ధర్మబద్ధంగా నిర్వహించే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు బయటకు వచ్చి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, సంకీర్ణ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించుకుందని పేర్ని నాని స్పష్టం చేశారు.
Advertisement